దాతలు & సేవా భాగస్వాములు
సహాయం చేయాలనే మనసులతో అవసరంలో ఉన్నవారిని కలుపుతూ సాగుతున్న పవిత్ర సేవా ప్రయాణం.
దాతల సహకారంతోనే సాధ్యమైన సేవా విప్లవం
విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీ అల్లు శ్రీనివాసరావు గారి వ్యక్తిగత ఆర్థిక వనరులు పరిమితమైనప్పటికీ, స్నేహితులు, వ్యాపారవేత్తలు, జిమ్ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు సేవాభావం కలిగిన అనేక మంది దాతల సహకారాన్ని సమన్వయం చేయడం ద్వారా అన్నదాన రథం, వరద సహాయం, నిత్యావసర కిట్లు మరియు విద్యా సహాయం విజయవంతంగా అందించగలిగారు.
దాతల సహకారంతో చేపట్టిన కొన్ని ప్రముఖ కార్యక్రమాలు
అన్నదాన రథం వ్యాన్ విరాళం
శుభకార్యక్రమాలలో మిగిలిపోయే ఆహారాన్ని సేకరించి పేదలకు పంచేందుకు దాతల సహకారంతో ప్రత్యేక అన్నదాన రథం వాహనాన్ని సమకూర్చడం జరిగింది.
పత్రికా కథనం చదవండి →దివ్యాంగుడికి ట్రైసైకిల్ సాయం
ఫిట్ జోన్ జిమ్ సభ్యులు మరియు దాతల సహకారంతో ప్రమాదంలో గాయపడిన మురళికి ఉపాధి నిమిత్తం ఆర్థిక సహాయం మరియు ట్రైసైకిల్ అందించడం జరిగింది.
పత్రికా కథనం చదవండి →వరద బాధితులకు 500 కిట్లు
స్వచ్ఛంద సేవకుడు మాధవరావు మరియు గ్రామస్థుల సహకారంతో బియ్యం, బట్టలు సేకరించి గోదావరి వరద బాధితులకు అందజేత.
పత్రికా కథనం చదవండి →