పదో తరగతి విద్యార్థినులకు పరీక్ష సామగ్రి పంపిణీ
Publication: సాయిగోదావరి న్యూస్
Date: తేదీ స్పష్టంగా లేదు
Category: విద్యా సహాయం
Original Newspaper Clipping
Click image to zoom full-size
Archived News Record
English News Report & Translation
Examination boards and pens were distributed to encourage Class 10 girl students at Potti Sriramulu Girls’ High School in One Town, Bhimavaram. The programme was organised under the initiative of Allu Srinivas, president of Vignana Vedika Seva Samstha. Alliance Club leader V. Rammurthy Raju said education can change the circumstances of economically weaker families and help women enter professions and contribute to national development. He appreciated the organisation for arranging donor-supported educational encouragement for students in government schools. School in-charge headmaster Varanasi Radhakrishna thanked Allu Srinivas for helping provide examination boards and pens to 100 students. Srinivas thanked Rajesh Jain of Bhansali Bangles Store for supplying the materials. Organisation representatives and teachers participated.
Original Telugu Newspaper Transcription
భీమవరం: పదో తరగతి పరీక్షలకు వెళుతున్న విద్యార్థినులకు ప్రోత్సాహకంగా పరీక్ష అట్టలు, పెన్నులు అందించే కార్యక్రమం విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం వన్‌టౌన్‌లోని పొట్టి శ్రీరాములు బాలికోన్నత పాఠశాలలో నిర్వహించారు. అలయన్స్ క్లబ్ నాయకులు వేగేశ్న రామ్మూర్తి రాజు మాట్లాడుతూ విద్య ద్వారానే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబ వ్యవస్థలో మార్పు సాధ్యమవుతుందని, మహిళలు విద్య ద్వారా అనేక రంగాల్లో ఉద్యోగాలు సాధించి దేశ ప్రగతికి తోడ్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు దాతల ద్వారా విద్యా ప్రోత్సాహం అందిస్తున్న విజ్ఞాన వేదిక సేవా సంస్థ సేవలు అభినందనీయమని తెలిపారు. పాఠశాల ఇన్చార్జి హెచ్.ఎం. వారణాసి రాధాకృష్ణ మాట్లాడుతూ వంద మంది పదో తరగతి విద్యార్థినులకు పరీక్ష అట్టలు, పెన్నులు అందించేందుకు సహకరించిన అల్లు శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అల్లు శ్రీనివాస్ విద్యా సామగ్రి అందించిన భంసాలి బ్యాంగిల్ స్టోర్ అధినేత రాజేష్ జైన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, అరసవల్లి మణికంఠ వెంకటేష్, కొమ్ము శ్రీనివాస్, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.
Editorial Note:
This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
More Documented Press Clippings
జ్యోతి న్యూస్
స్థానిక దినపత్రిక
సాయిగోదావరి న్యూస్