వృద్ధ కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు
Publication: సాయిగోదావరి న్యూస్
Date: తేదీ స్పష్టంగా లేదు
Category: వృద్ధుల సంక్షేమం
Original Newspaper Clipping
Click image to zoom full-size
Archived News Record
English News Report & Translation
Two months’ worth of essential groceries and rice were provided under the leadership of Vignana Vedika Seva Samstha to an elderly family struggling to meet daily needs. The assistance was handed over by Bhimavaram Sub-Jail Superintendent Venkatagiri. He said helping poor families facing hardship in old age is a basic social responsibility. The report identifies the family as that of Bandaru Ramachandra Rao of Ward 19, Bhimavaram, who had previously worked as a cycle mechanic but was facing financial difficulties in old age. Allu Srinivas said that, following his request, Naramamidi Gangaram sponsored two months’ worth of essential groceries and 26 kilograms of rice. Indukuri Sivaji Varma and Valmiki Balaji participated.
Original Telugu Newspaper Transcription
భీమవరం: పూట గడవడం కష్టంగా ఉన్న వృద్ధ కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు, బియ్యం విజ్ఞాన వేదిక సేవా సంస్థ నేతృత్వంలో అందజేశారు. భీమవరం సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటగిరి చేతుల మీదుగా సహాయం అందించారు. ఆయన మాట్లాడుతూ వృద్ధాప్యానికి చేరి పేదరికంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు చేతనైన సాయం చేయడం కనీస ధర్మమని అన్నారు. భీమవరం 19వ వార్డుకు చెందిన బండారు రామచంద్రరావు గతంలో సైకిల్ మెకానిక్‌గా జీవనం సాగించారని, వృద్ధాప్యం కారణంగా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కష్టంగా మారిందని వివరించారు. సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ తన అభ్యర్థన మేరకు భీమవరం పట్టణానికి చెందిన నరమామిడి గంగారామ్ సౌజన్యంతో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, 26 కిలోల బియ్యం అందించినట్లు తెలిపారు. దాతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, వాల్మీకి బాలాజీ పాల్గొన్నారు.
Editorial Note:
This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
More Documented Press Clippings
వెంకట్ శక్తి
నేటి సత్తా
స్థానిక దినపత్రిక