Vignana Vedika Service Organisation

VIGNANA VEDIKA SEVA SAMSTHA • Regd. No: 167 of 2022
Sri. Allu Srinivasa Rao
Founder & Social Service Lead Sri. Allu Srinivasa Rao Nearly 30 Years of Voluntary Service

ప్రపంచ దర్జీల దినోత్సవం సందర్భంగా సీనియర్ టైలర్ల సత్కారం

Publication: వశిష్టటుడే Date: ఫిబ్రవరి 28; సంవత్సరం నిర్ధారణ అవసరం Category: వృత్తి గౌరవం
Original Newspaper Clipping
Newspaper clipping - ప్రపంచ దర్జీల దినోత్సవం సందర్భంగా సీనియర్ టైలర్ల సత్కారం Click image to zoom full-size
Archived News Record
Share this report:

English News Report & Translation

Senior tailors were felicitated at the Arasavalli Charities building in Bhimavaram by Vignana Vedika Seva Samstha on World Tailors Day. Retired Sub-Inspector Prasada Raju spoke about the sewing machine and the livelihood that tailoring has provided to many people. He said clothing contributes to dignity and status, and observed that the availability of ready-made garments had reduced support for the tailoring profession. Organiser Allu Srinivas said tailoring is one of the traditional arts and that skilled trades should be encouraged, including by creating livelihood opportunities for tailors facing difficulties. He thanked Naramamidi Gangaram for supporting the event.

Original Telugu Newspaper Transcription

భీమవరం, ఫిబ్రవరి 28: ప్రపంచ దర్జీల దినోత్సవం (టైలర్స్ డే) సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం అరసవల్లి చారిటీస్ భవనంలో సీనియర్ టైలర్లను ఘనంగా సత్కరించారు. రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరాజు మాట్లాడుతూ 1846 ఫిబ్రవరి 28న విలియం హోవే కుట్టు మిషన్‌ను కనుగొన్నారని, అప్పటి నుంచి ఎంతోమంది దర్జీలు ఈ వృత్తి ద్వారా ఉపాధి పొందుతున్నారని అన్నారు. మనం ధరించే దుస్తులు గౌరవంతో పాటు హోదాను కల్పిస్తాయని, గతంలో దర్జీలకు మంచి ఆదరణ ఉండేదని, ప్రస్తుతం రెడీమేడ్ దుస్తుల కారణంగా టైలరింగ్ వృత్తికి ఆదరణ తగ్గుతోందని తెలిపారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ మనకున్న 64 కళల్లో టైలరింగ్ కూడా ఒక కళ అని, చేతివృత్తుల వారిని ప్రోత్సహిస్తూ వెనుకబడిన టైలర్లకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన నరమామిడి గంగారామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Editorial Note: This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
Chat with us