ఎస్.ఐ. వెంకటేశ్వరరావుకు అభినందన సన్మానం
Publication: నేటి సత్తా
Date: తేదీ స్పష్టంగా లేదు
Category: పోలీసు శాఖతో సమన్వయం
Original Newspaper Clipping
Click image to zoom full-size
Archived News Record
English News Report & Translation
An appreciation meeting was organised at the Lutheran High School grounds in Bhimavaram on the transfer of One Town SI Venkateswara Rao to Ganapavaram. It was arranged under the initiative of Vignana Vedika and Allu Srinivas, with voluntary organisations and sportspersons participating. One Town CI Krishna Bhagavan attended as chief guest and Varghese Daniel presided. The CI said the police had remained alert during COVID and that SI Venkateswara Rao had served for two years with dedication and a spirit of service. Allu Srinivas recalled the officer’s public-awareness work, preventive measures and support for service activities during the pandemic. The SI was felicitated with a shawl, garlands and a memento.
Original Telugu Newspaper Transcription
భీమవరం: వన్ టౌన్ ఎస్.ఐ. వెంకటేశ్వరరావు గణపవరం బదిలీ అయిన సందర్భంగా లూథరన్ హైస్కూల్ గ్రౌండ్‌లో విజ్ఞాన వేదిక, అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు, క్రీడాకారుల మధ్య అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి వన్ టౌన్ సి.ఐ. కృష్ణభగవాన్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, లూథరన్ హైస్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వర్గీస్ డానియల్ అధ్యక్షత వహించారు. సి.ఐ. మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో ప్రజలు వైరస్ బారిన పడకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా విధులు నిర్వహించిందని, ఎస్.ఐ. వెంకటేశ్వరరావు రెండు సంవత్సరాల పాటు విధిని దైవంగా భావించి స్నేహభావంతో, సేవాభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని అన్నారు. అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఎస్.ఐ. ప్రజలను అప్రమత్తం చేస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకున్నారని, సమయపాలన లేకుండా సిబ్బందితో విధులు నిర్వహించారని, అనేక సేవా కార్యక్రమాలకు సహకరించారని తెలిపారు. అనంతరం ఎస్.ఐ. వెంకటేశ్వరరావును శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో కోడే యుగంధర్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, దాసరి చందు, ఇందుకూరి శివాజీ వర్మ, కడియం ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
Editorial Note:
This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
More Documented Press Clippings
వెంకట్ శక్తి
వశిష్టటుడే